చైనా వస్తువులను బహిష్కరించండి : పాశ్వాన్ పిలుపు
ABN , First Publish Date - 2020-06-18T23:59:06+05:30 IST
చైనా వస్తువులను బహిష్కరించాలని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ : చైనా వస్తువులను బహిష్కరించాలని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇకపై చైనా నుంచి దిగుమతయ్యే వస్తువుల విషయంలో బిఐఎస్ క్వాలిటీ’ రూల్స్‌ను కచ్చితంగా పాటిస్తామని ఆయన ప్రకటించారు. రోజువారీ కార్యాలయ పనుల్లో చైనా వస్తువులను వాడకూడదని కార్యాలయ వర్గాలకు ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
‘‘చైనా ప్రవర్తన కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలని అందరికీ పిలుపునిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాలకు మన వస్తువులను ఎగుమతి చేసే క్రమంలో వారందరూ తనిఖీలు చేస్తారని, బాస్మతీ బియ్యాన్ని ఎగుమతి చేస్తే తిరస్కరిస్తారని అన్నారు. అయితే వారి వస్తువులు మన దేశానికి వస్తే మాత్రం కఠిన నిబంధనలు ఉండవని, ఇకపై వీటిని మారుస్తామని పాశ్వాన్ ప్రకటించారు.