రామాలయం కోసం రాగి విరాళమివ్వండి...

ABN , First Publish Date - 2020-08-20T12:33:08+05:30 IST

అయోధ్యలోని రామాలయం నిర్మాణం కోసం 10,000 రాగి రాడ్లు అవసరమని, భక్తులు రాగిని విరాళంగా ఇవ్వాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు....

రామాలయం కోసం రాగి విరాళమివ్వండి...

శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వినతి

అయోధ్య (ఉత్తరప్రదేశ్): అయోధ్యలోని రామాలయం నిర్మాణం కోసం 10,000 రాగి రాడ్లు అవసరమని, భక్తులు రాగిని విరాళంగా ఇవ్వాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. రామాలయం 1000 ఏళ్లు నిలిచేలా రాళ్లతో  నిర్మిస్తామని చంపత్ రాయ్ చెప్పారు. రామాలయం నిర్మాణంలో చెన్నై ఐఐటీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ సహకారం తీసుకుంటున్నామని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి అయిన చంపత్ రాయ్ వెల్లడించారు. రామాలయం నిర్మాణంలో భూమి పటిష్ఠతపై చెన్నై ఐఐటీ,  సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ సహకారం అందిసత్ున్నాయని రాయ్ చెప్పారు. భూకంపాలను తట్టుకునేలా రామాలయాన్ని నిర్మిస్తున్నామని ఆయన వివరించారు.లార్సెన్ అండ్ టుబ్రో కంపెనీ నిర్మాణపనులు పర్యవేక్షిస్తుందని రాయ్ వివరించారు.

Updated Date - 2020-08-20T12:33:08+05:30 IST