బీహార్ ఎన్నికల్లో సుశాంత్‌కు మద్దతుగా ర్యాలీలు

ABN , First Publish Date - 2020-10-28T21:50:01+05:30 IST

ఒకపక్క ఎన్నికలపోరు సాగుతున్నా.. సుశాంత్ అభిమానుల హోరు మాత్రం ఆగడం లేదు. సుశాంత్‌ను హత్య చేసిన వారికి శిక్ష పడాలంటూ...

బీహార్ ఎన్నికల్లో సుశాంత్‌కు మద్దతుగా ర్యాలీలు

ఒకపక్క ఎన్నికలపోరు సాగుతున్నా.. సుశాంత్ అభిమానుల హోరు మాత్రం ఆగడం లేదు. సుశాంత్‌ను హత్య చేసిన వారికి శిక్ష పడాలంటూ అనేక చోట్ల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్‌కు న్యాయం జరిగేలా చూసే ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.  సుశాంత్ బీహార్ బిడ్డ అని, అందులోనూ గొప్ప నటుడని, కొందరి స్వార్థం, దుర్మార్గానికి అతడు బలయ్యాడని, అతడికి కచ్చితంగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా #BiharVote4SSRJustice అనే హ్యాష్‌ట్యాగ్‌ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. గంటల వ్యవధివలోనే వేల సంఖ్యలో ట్వీట్లు పోస్టయ్యాయి.

Updated Date - 2020-10-28T21:50:01+05:30 IST