ధోని లోక్‌సభకు పోటీ చేయాలి: సుబ్రమణియన్ స్వామి

ABN , First Publish Date - 2020-08-16T21:53:25+05:30 IST

దోనీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అన్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం తన క్రికెట్‌ కెరీర్‌కు..

ధోని లోక్‌సభకు పోటీ చేయాలి: సుబ్రమణియన్ స్వామి

న్యూఢి్ల్లీ: దోనీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అన్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం తన క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఎందరో క్రీడాకారులు, ప్రముఖ రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. వారిలో రాజ్యసభ ఎంపీ సబ్రమణియన్ స్వామి కూడా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత ధోని రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన ఓ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. ధోని క్రికెట్ నుంచి మాత్రమే రిటైర్ అవుతున్నాడని, మిగతా దేని నుంచి రిటైర్ కావడంలేదని ఆయన అన్నారు. ‘ధోని గొప్ప నాయకుడు. అతడి వంటి నాయకులు ప్రజలకు ఎంతో ఉపయోగపడతారు. అతనికున్న సమయస్పూర్తి, అనుభవంతో సమస్యలకు చక్కటి పరిష్కారాలను అందించవచ్చు. అందుకే ధోని 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల’ని స్వామి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.Updated Date - 2020-08-16T21:53:25+05:30 IST