ఎన్డీయేకు మద్దతు తెలిపిన వైసీపీ

ABN , First Publish Date - 2020-09-14T21:10:19+05:30 IST

అంతకుముందు మీడియాతో మాట్లాడిన వైసీపీ రాజ్యసభ ఎంపీ సాయి రెడ్డి.. ఎన్డీయే

ఎన్డీయేకు మద్దతు తెలిపిన వైసీపీ

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయేకు వైసీపీ మద్దతు తెలిపింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు టీఆర్ఎస్ దూరంగా ఉంది. అంతకుముందు మీడియాతో మాట్లాడిన వైసీపీ రాజ్యసభ ఎంపీ సాయి రెడ్డి..  ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌కే మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. 




ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ పోటీ చేస్తుండగా… ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ ఝా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకుగాను… 244 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 123 మంది మద్దతు పొందినవారికి డిప్యూటీ చైర్మన్‌ పదవి దక్కుతుంది. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేడీ, వైసీసీ, టీఆర్ఎస్ పార్టీల మద్దతు కీలకంగా మారింది. 

Updated Date - 2020-09-14T21:10:19+05:30 IST