త్రివిధ దళాధిపతులతో సమావేశమైన రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2020-07-10T21:47:13+05:30 IST

త్రివిధ దళాల అధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

త్రివిధ దళాధిపతులతో సమావేశమైన రాజ్‌నాథ్

న్యూఢిల్లీ : త్రివిధ దళాల అధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై వీరితో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్ నరవాణే, నేవీ చీఫ్ కరంవీర్ సింగ్, వాయుసేన చీఫ్ బధూరియాతో పాటు సీనియర్లు హాజరయ్యారు. గాల్వాన్ వ్యాలీ, గోర్గా, తదితర ప్రాంతాల నుంచి బలగాలు వెనక్కి తగ్గడంపై నరవాణే ఓ సమగ్ర రిపోర్టు సమర్పించినట్లు సమాచారం. 


Updated Date - 2020-07-10T21:47:13+05:30 IST