రైతులతో చర్చించడానికి నేను సిద్ధం : రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2020-11-27T14:19:07+05:30 IST

రైతులతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని

రైతులతో చర్చించడానికి నేను సిద్ధం : రాజ్‌నాథ్

న్యూఢిల్లీ : రైతులతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేయడానికి ఇటీవల కేంద్రం రూపొందించిన చట్టాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని అన్నారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘రైతులకు భరోసా కల్పించాలని డిసైడ్ అయ్యాం. మేము రైతులను మోసం చేయం అని భరోసా ఇస్తున్నాం. నేను రక్షణ శాఖా మంత్రినే. కానీ ఓ రైతు బిడ్డగా నేను రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నా.’’ అని రాజ్‌నాథ్ ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని, వచ్చే నాలుగైదేళ్లలో ఆ లాభాలను రైతులు చూడగలుగుతారని ఆయన పేర్కొన్నారు.


నూతన చట్టాలు రైతులకు ఏమాత్రం హాని కలిగించవని ధీమాగా ప్రకటించగలనని, ఎందుకంటే చట్టంలోని ప్రతి పేరాను తాను క్షుణ్ణంగా చదవానని ఆయన నొక్కి వక్కాణించారు. చట్టాలతో వ్యవసాయ మార్కెట్లేమీ నష్టపోవని, అవి కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో కనీస మద్దుత ధరకు ఎలాంటి ముప్పూ లేదని, భవిష్యత్తులో కూడా కనీస మద్దతు ధర కొనసాగుతూనే ఉంటుందని రాజ్‌నాథ్ ప్రకటించారు. 

Updated Date - 2020-11-27T14:19:07+05:30 IST