రైతులతో చర్చలు జరపనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్!
ABN , First Publish Date - 2020-12-01T16:48:35+05:30 IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, తోమర్ మంగళవారం ఉదయం మరోసారి సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, తోమర్ మంగళవారం ఉదయం మరోసారి సమావేశమయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై వీరు చర్చించినట్లు సమాచారం. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతు సంఘాల నేతలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే తాను రైతులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నానని రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నడ్డా ఇంట్లో సమావేశమైన కేంద్ర మంత్రులు అమిత్‌షా, తోమర్, నడ్డా తదితరులు రాజ్‌నాథ్ సింగ్ చర్చలకు వెళితేనే బాగుటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేతకంగా పంజాబ్ సహా పలు రాష్ట్రాల రైతు సంఘాలు చేపట్టిన 'ఢిల్లీ ఛలో' నిరసన మార్చ్ కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన మంగళవారం ఆరవ రోజుకు చేరింది. కేంద్రం విజ్ఞప్తికి చలించకుండా రైతులు తమ డిమాండ్లు వినేంతవరకూ ఆందోళన కొనసాగించేందుకు పట్టుదలగా ఉన్నారు.