రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ: డైరెక్టర్

ABN , First Publish Date - 2020-11-28T01:12:45+05:30 IST

రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ: డైరెక్టర్

రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ: డైరెక్టర్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.


ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మూడు అంతస్తుల భవనాన్ని కోవిడ్ -19 వ్యాక్సిన్ నిల్వ కేంద్రంగా మారుస్తామని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బిఎల్ షెర్వాల్ తెలిపారు. టీకాను నిల్వ చేయడానికి ఉపయోగించే రిఫ్రిజిరేటర్ల అవసరాలకు అనుగుణంగా భవనం యొక్క విద్యుత్ ఫీడ్ సవరించబడుతుందని షెర్వాల్ చెప్పారు.

Read more