జనతా కర్ఫ్యూలో పాలుపంచుకుందాం: రజినీకాంత్

ABN , First Publish Date - 2020-03-22T01:11:40+05:30 IST

ఇటలీలో కూడా ఇదేవిధంగా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడం ద్వారా స్టేజ్-3కి కరోనా వైరస్ చేరకుండా ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే ప్రజల నుంచి సహకారం లోపించడంతో ..

జనతా కర్ఫ్యూలో పాలుపంచుకుందాం: రజినీకాంత్

చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారంనాడు ఓ ట్వీట్  చేశారు. 'జనతా కర్ఫ్యూను పురస్కరించుకుని ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి. ఒకరికొరకు దూరంగా ఉండటం అలవరుకోవాలి' అని రజినీ ఆ ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.


ఇటలీలో కూడా ఇదేవిధంగా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడం ద్వారా స్టేజ్-3కి కరోనా వైరస్ చేరకుండా ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే ప్రజల నుంచి సహకారం లోపించడంతో వేలాది మంది కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇండియాలో అలాంటి సంక్షోభం రాకూడదని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకావాలని అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు, నర్సులు, మెడికల్ వర్కర్ల నిస్వార్థ సేవలు నిరుపమానమని, వారి సేవలకు అభినందలు తెలుపుతూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశవ్యాప్తంగా అంతా ప్రార్థనల్లో పాల్గొనాలని రజినీకాంత్ కోరారు.

Updated Date - 2020-03-22T01:11:40+05:30 IST