రాజీనామా చేయాలి.. ఢిల్లీ అల్లర్లపై రజినీ సంచలన ట్వీట్

ABN , First Publish Date - 2020-03-02T18:10:59+05:30 IST

ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా

రాజీనామా చేయాలి.. ఢిల్లీ అల్లర్లపై రజినీ సంచలన ట్వీట్

చెన్నై: ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఆయన.. ఢిల్లీ అల్లర్లను ఖండించారు. అల్లర్లను అదుపు చేయలేకపోయిన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో శాంతి స్థాపన కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. దేశంలో శాంతి, సమైక్యతను నెలకొల్పడమే తన తొలి ప్రాధాన్యమని ట్వీట్ చేశారు. 


చెన్నైలోని రజినీ నివాసంలో టీఎన్‌జేయూ(తమిళనాడు జమతా ఊమా సభై) సభ్యులు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీపై చర్చించారు. సీఏఏ వల్ల ఏ ఒక్క ముస్లిం ఇబ్బంది పడ్డా... మొదటిగా గొంతెత్తేది తానేనని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-03-02T18:10:59+05:30 IST