రజినీకాంత్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల

ABN , First Publish Date - 2020-12-26T01:47:56+05:30 IST

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రజినీకాంత్ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు

రజినీకాంత్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల

హైదరాబాద్: సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రజినీకాంత్ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. రజినీ ఈ రాత్రి ఆస్పత్రిలోనే ఉంటారని రేపు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన అవసరం లేదని వైద్యులు చెప్పారు. రజినీని కలిసేందుకు సందర్శకులకు అనుమతి లేదని ప్రకటించారు. రజినీకాంత్ కుమార్తె ఆయనతోనే ఉన్నారని అపోలో వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో రజినీకాంత్‌కు చికిత్స కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ సూట్‌లోని ప్రత్యేక రూంలో రజినీకి వైద్యం అందిస్తున్నారు. ఒక డాక్టర్ పర్యవేక్షణలో రజినీ సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నారు. ఇప్పటికే చెన్నై నుంచి  హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రజినీ వ్యక్తిగత వైద్యులు చేరుకున్నారు.

Updated Date - 2020-12-26T01:47:56+05:30 IST