‘రజనీ నిద్రపోడు... ఇతరులను నిద్రపోనివ్వడు’
ABN , First Publish Date - 2020-03-13T13:50:35+05:30 IST
తన రాజకీయ ప్రవేశంపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని, ఆయన నిద్రపోడని, అలాగే ఇతరులను నిద్రపోనివ్వడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ విమర్శించారు. శివగంగ జిల్లా కారైకుడిలో ముత్తరసన్..

చెన్నై: తన రాజకీయ ప్రవేశంపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని, ఆయన నిద్రపోడని, అలాగే ఇతరులను నిద్రపోనివ్వడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ విమర్శించారు. శివగంగ జిల్లా కారైకుడిలో ముత్తరసన్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ, రజనీకాంత్ తాను కొత్త పార్టీ ప్రారంభిస్తాననో, పార్టీ సిద్ధాంతాల గురించి ప్రస్తావించలేదని, తన వెంట సమర్ధవంతమైన నాయకులు లేరని, ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి 30 నుంచి 35 శాతం వరకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పడం పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించినట్లేనని ఆయన విమర్శించారు. పార్టీకి ఒక నేత, ప్రభుత్వానికి ఒక నేత అని చెబుతున్న రజనీకాంత్ పార్టీని ప్రారంభించాక ప్రకటించి ఉంటే బాగుంటుందని, రాష్ట్ర రాజకీయాలలో శూన్యం ఉందని చెబుతున్న రజనీ అభిప్రాయం సరికాదన్నారు. కోయంబత్తూర్‌లో సీఆర్‌పీఎఫ్ పోలీ సు బలగాలను పెద్దసంఖ్యలో మోహరింపజేయడంపై స్పందించిన ముత్తరసన్, ఒక్క కోయంబత్తూర్‌లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా మతకలహాలను ప్రోత్సహించే వి ధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీలో దళితులకు పదవులు కల్పించడం వారిని మోసం చేసేందుకేనని ముత్తరసన్ పేర్కొన్నారు.