‘దీక్షలు చేపట్టైనా సరే రజనీని రాజకీయాల్లోకి రప్పిస్తాం’
ABN , First Publish Date - 2020-10-31T16:11:48+05:30 IST
పోయెస్‌గార్డెన్‌లో ఉన్న రజనీకాంత్ ఇంటి వద్ద అభిమానులు గుమిగూడడం కలకలం రేపింది. రజనీకాంత్ పేరిట సోషల్ మీడియాలో రాసిన లేఖ రాష్ట్రంలో దుమారం లేపింది. దీనిపై స్పందించిన రజనీ, ఆ లేఖ తాను రాయలేదని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉన్నానని ట్విట్టర్‌లో బదులిచ్చారు.

చెన్నై : పోయెస్‌గార్డెన్‌లో ఉన్న రజనీకాంత్ ఇంటి వద్ద అభిమానులు గుమిగూడడం కలకలం రేపింది. రజనీకాంత్ పేరిట సోషల్ మీడియాలో రాసిన లేఖ రాష్ట్రంలో దుమారం లేపింది. దీనిపై స్పందించిన రజనీ, ఆ లేఖ తాను రాయలేదని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉన్నానని ట్విట్టర్‌లో బదులిచ్చారు. దీంతో, తలైవర్ రాజకీయాల్లోకి రావాలని ఆశించిన అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో, చెన్నై ఎగ్మూర్ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు రజనీ అభిమానులు పోయస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి వద్దకు చేరు కున్నారు. వారు ‘ప్రభుత్వ మార్పు, రాజకీయాల్లో మార్పు ఇప్పట్లో లేదా? ఇక ఎప్పుడూ లేదా? అనే వ్యాఖ్యలతో కూడిన టీ-షర్టులు ధరించారు. ఈ సందర్భంగా దీక్షలు చేపట్టి అయినా ఆయనను రాజకీయాల్లో రప్పి స్తామంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ‘ఓటు వేస్తే రజనీకాంత్‌కే, మీరు రావాలి రజనీ... మా మద్దతు మీకే’ అనే నినాదాలతో కూడిన పోస్టర్లు నగరంలో దర్శనమిస్తున్నాయి.