అపోలో ఆస్పత్రి నుంచి రజినీకాంత్‌ డిశ్చార్జ్‌

ABN , First Publish Date - 2020-12-27T21:23:11+05:30 IST

అపోలో ఆస్పత్రి నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని రజినీకాంత్‌కు వైద్యుల సూచించారు.

అపోలో ఆస్పత్రి నుంచి రజినీకాంత్‌ డిశ్చార్జ్‌

హైదరాబాద్‌: అపోలో ఆస్పత్రి నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని రజినీకాంత్‌కు వైద్యుల సూచించారు. ఒత్తిడికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. కాసేపట్లో చెన్నైకి ఆయన బయలుదేరనున్నారు. ఇటీవల రజినీకాంత్‌ అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులకు అందిన ఆరోగ్య పరీక్షల నివేదిక ప్రకారం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తమిళ సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్‌ కోసం రజినీకాంత్‌ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. అయితే చిత్రబృందంలో కొందరు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో చిత్రీకరణ నిలిపివేశారు. ఈ నెల 22న రజినీకాంత్‌ కూడా పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. Updated Date - 2020-12-27T21:23:11+05:30 IST