దేవాలయ భూమి పూజ: పునాదిలో పోసిన 11,000 లీటర్లు..

ABN , First Publish Date - 2020-12-29T03:25:38+05:30 IST

ఈ 11,000 లీటర్లలో 1,500 లీటర్ల పెరుగు, ఒక క్వింటాల్ నెయ్యి ఉందట. కాగా మొత్తంగా దీని ఖర్చు 1.50 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. ఈ విషయమై మందిర నిర్మాణ కమిటీ సభ్యులు రాంలాల్ గుజ్జర్ మాట్లాడుతూ

దేవాలయ భూమి పూజ: పునాదిలో పోసిన 11,000 లీటర్లు..

జైపూర్: రాజస్తాన్‌లో ఓ దేవాలయ భూమి పూజ కోసం వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యిని ఉపయోగించారు. 11,000 లీటర్ల పాలు, పెరుగు, నెయ్యిని దేవాలయ భూమి పూజలో భాగంగా పునాదిలో పోశారు. రాష్ట్రంలోని జలవార్ జిల్లా రాట్లాయి ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన ఈ గుడి పూజ కార్యక్రమం శనివారం జరిగింది. గుజ్జార్ కమ్యూనిటీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేల లీటర్ల సంఖ్యలో పాలు, పెరుగు, నెయ్యిని ఉపయోగించారు.


ఈ 11,000 లీటర్లలో 1,500 లీటర్ల పెరుగు, ఒక క్వింటాల్ నెయ్యి ఉందట. కాగా మొత్తంగా దీని ఖర్చు 1.50 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. ఈ విషయమై మందిర నిర్మాణ కమిటీ సభ్యులు రాంలాల్ గుజ్జర్ మాట్లాడుతూ ఈ మహత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గుజ్జర్ కమ్యూనిటీని విజ్ణప్తి చేయగా, వాళ్లు పెద్ద ఎత్తున స్పందించారని ఆయన అన్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో పాలు వృధా చేస్తున్నారనే వాదనలను ఆయన ఖండించారు. దేవ్‌నారాయణుడిని ఈ విధంగా పూజించడం తమ సంప్రదాయంలో భాగమని రాంలాల్ అన్నారు.

Updated Date - 2020-12-29T03:25:38+05:30 IST