షాకింగ్ : రాజస్థాన్ రాష్ట్రంలో ఒక్కరోజే 242 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-05-18T11:46:24+05:30 IST
రాజస్థాన్ రాష్ట్రంలో ఒక్కరోజే అత్యధికంగా 242 కరోనా కేసులు వెలుగుచూడటం సంచలనం రేపింది....

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలో ఒక్కరోజే అత్యధికంగా 242 కరోనా కేసులు వెలుగుచూడటం సంచలనం రేపింది. రాజస్థాన్ రాజధాని నగరమైన జైపూర్ లో 60 మందికి కరోనా వైరస్ సోకింది. జోధ్ పూర్ నగరంలో 43 మందికి, దుంగార్ పూర్ నగరంలో 18 మందికి, ఉదయ్ పూర్ లో 17 మందికి పాలీ నగరంలో 14 మందికి, చురూ పట్టణంలో 13 మందికి, నాగౌర్ లో 11 మందికి, రాజ్ సముంద్ లో 10 మందికి , సిరోహి నగరంలో 10 మందికి కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట్రంలో ఈ నెల 31వతేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.