టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ABN , First Publish Date - 2020-10-03T20:42:07+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య 15వ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య 15వ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ జట్టు ఒకే మార్పుతో బరిలోకి దిగుతోంది. అంకిత్ రాజ్‌పూత్ స్థానంలో మహిపాల్ లోమ్రోర్ జట్టులోకి వచ్చాడు. బెంగళూరు మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. చెరో మూడు మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు ఒక్కో ఓటమితో నాలుగు పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ ఐదో స్థానంలో ఉండగా, బెంగళూరు ఆరో స్థానంలో ఉంది. 

Updated Date - 2020-10-03T20:42:07+05:30 IST