రాజస్థాన్‌లో అతి తక్కువగా యాక్టివ్ కేసులు.. కోలుకున్న వారితో పోల్చితే 25 శాతమే!
ABN , First Publish Date - 2020-06-19T03:30:16+05:30 IST
రాజస్థాన్‌లో నేడు 300కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 14,000కు..
జైపూర్: రాజస్థాన్‌లో నేడు 300కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 14,000కు చేరువయింది. తాజా కేసులకు సంబంధించి ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 315 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 275 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,857కు చేరింది. వీరిలో 2,785మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 10,742మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 330 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉంటే రాజస్థాన్‌లో కరోనా యాక్టివ్ కేసులు తక్కువగా ఉండడం సంతోషకరం. కేవలం 2785 యాక్టివ్ కేసులు మాత్రమే రాష్ట్రంలో ఉండడంతో ప్రభుత్వంపై కొంత భారం తగ్గినట్లవుతోంది. అయితే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ కరోనా విజృంభించే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైతే రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య కోలుకున్న వారిలో 25.92 శాతం మాత్రమే ఉంది.