కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయనున్న రాజస్థాన్

ABN , First Publish Date - 2020-10-31T14:54:44+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. ముఖ్యంగా కనీస మద్దతు ధర కంటే

కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయనున్న రాజస్థాన్

రాజస్థాన్ : నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. ముఖ్యంగా కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకే పంటను తీసుకునే వారిపై కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష విధించేలా అసెంబ్లీ ఓ చట్టాన్ని కూడా తీసుకు రానుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు కేవలం కార్పొరేట్లకు అనుగుణంగానే ఉన్నాయని, రైతులకు వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ ఈ సందర్భంగా విమర్శించింది. అయితే కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ భగ్గుమన్నది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయడమంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమేనని బీజేపీ మండిపడింది. 

Read more