గెహ్లాట్‌తో కలిసి ఎమ్మెల్యేల సంఘీభావ పాట..

ABN , First Publish Date - 2020-07-20T23:44:56+05:30 IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతుగా జైపూర్‌లోని ఫైర్‌మాంట్ హోటల్‌లో మకాం వేసిన కాంగ్రెస్ ..

గెహ్లాట్‌తో కలిసి ఎమ్మెల్యేల సంఘీభావ పాట..

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతుగా జైపూర్‌లోని ఫైర్‌మాంట్ హోటల్‌లో మకాం వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి కూడా సందడిగా గడిపారు. రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభ నేపథ్యంలో తామంతా కలిసే ఉన్నామన్న సంకేతాలు ఇస్తూ 'హమ్ హోంగే కామ్యాబ్' (మేం సాధించగలుగుతాం) అంటూ కలిసి పాటపాడుతూ సందడి చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం వీరి పాటకు గొంతు కలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలో గెహ్లాట్‌కు దన్నుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలంతా చుట్టూచేరి కూర్చున్నారు. చప్పట్లు చరుస్తూ 'హమ్ హోంగే..' పాట పాడారు. దీనికి ముందు రోజు ఎమ్మెల్యేలంతా అంత్యాక్షరితో సరదగా గడిపారు. అమీర్ ఖాన్ సూపర్‌హిట్ చిత్రం 'లగాన్', క్లాసిక్ హిట్ 'షోలే' చిత్రాలు చూడటం కనిపించింది. కొందరు ఎమ్మెల్యేలు వంట, యోగాలో శిక్షణ పొందుతున్నారు.


మరోవైపు, అధికార ఎమ్మెల్యేలు లగ్జరీ హోటల్‌లో అటపాటల్లో మునుగుతేలుతుండటంపై బీజేపీ చురకలు వేసింది. తమ నియోజకవర్గ ప్రజలను గాలిగి వదిలేసి, సినిమాలు చూస్తూ, పిజ్జా, పాస్తా తయారీలో తర్ఫీదు పొందుతుండటం వారి బాధ్యతారాహిత్యాన్ని చాటుతోందంటూ ఆ పార్టీ నేత సంబిత్ పాత్రా విమర్శించారు.

Updated Date - 2020-07-20T23:44:56+05:30 IST