గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడిపోయింది: బీజేపీ

ABN , First Publish Date - 2020-07-14T22:22:09+05:30 IST

జైపూర్: గెహ్లాట్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని బీజేపీ తెలిపింది. దమ్ముంటే మెజార్టీ నిరూపించుకోవాలని సవాలు విసిరింది. మెజార్టీ నిరూపించుకున్న తర్వాతే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని

గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడిపోయింది: బీజేపీ

జైపూర్: గెహ్లాట్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని బీజేపీ తెలిపింది. దమ్ముంటే మెజార్టీ నిరూపించుకోవాలని సవాలు విసిరింది. మెజార్టీ నిరూపించుకున్న తర్వాతే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని బీజేపీ సీనియర్ నేత గులాబ్ చంద్ కటారియా డిమాండ్ చేశారు. పైలట్ వెంట 18 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని వార్తలు వస్తున్న తరుణంలో బీజేపీ విశ్వాస పరీక్షకు డిమాండ్ చేసింది. విశ్వాస పరీక్ష నిర్వహిస్తేనే ప్రభుత్వానికి ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతుందనేది తేలుతుందని బీజేపీ అంటోంది. గెహ్లాట్ సర్కారును కూలిపోకుండా కాపాడే శక్తి ఏదీ లేదని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పునియా తెలిపారు. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని గెహ్లాట్ సర్కారును ఆదేశించే అవకాశాలున్నాయి.   


Updated Date - 2020-07-14T22:22:09+05:30 IST