ప్రభుత్వ ఆసుపత్రిలో ముస్లిం గర్భిణిపై నిర్ల్యక్షం... శిశువు మృతి
ABN , First Publish Date - 2020-04-05T11:12:33+05:30 IST
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో గల ప్రభుత్వ ఆసుపత్రి వార్తల్లో నిలిచింది. ముస్లిం వర్గానికి చెందిన గర్భిణిని చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆసుపత్రి...

భరత్‌పూర్: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో గల ప్రభుత్వ ఆసుపత్రి వార్తల్లో నిలిచింది. ముస్లిం వర్గానికి చెందిన గర్భిణిని చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆసుపత్రి నుండి వెనుతిరిగిన ఆ మహిళ అంబులెన్స్ లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కొద్దిసేపటికే ఆ నవజాత శిశువు మరణించింది. విషయం తెలుసుకున్న భరత్‌పూర్ జిల్లా యంత్రాంగం ఈ ఉదంతంపై దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ మహిళను ప్రస్తుతం భరత్‌పూర్‌లోని జానానా ఆసుపత్రిలో చేర్చారు. జానానా హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రూపేంద్ర మాట్లాడుతూ ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉండడటంతో, ఆమెను జైపూర్‌కు పంపించామన్నారు. ఈ ఉదంతంపై రాజస్థాన్ మంత్రి విశ్వేంద్ర సింగ్ మాట్లాడుతూ భరత్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రి హెడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, సంబంధిత డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.