‘రజనీ రాజకీయాల్లో రాణించలేరు’
ABN , First Publish Date - 2020-12-05T18:10:02+05:30 IST
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ రాణించడం

బెంగళూరు : తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ రాణించడం చాలా కష్టమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ద్రవిడ సంస్కృతి చాలా గొప్పదని, తమిళుల హృదయాలు గెలవడం అంత సులభం కాదన్నారు. తమిళ రాజకీయాలతో మమేకమయ్యే పార్టీలతో పెద్దగా సంబంధాల్లేని, రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన రజనీకాంత్‌ను ప్రజలు ఎన్నికల్లో ఆమోదించడం కష్టమని మొయిలీ అభిప్రాయపడ్డారు.