ఈ నెల 28 నుంచి వర్షాలకు అవకాశం

ABN , First Publish Date - 2020-12-26T16:40:50+05:30 IST

ఈ నెల 28 నుంచి వర్షాలకు అవకాశం

ఈ నెల 28 నుంచి వర్షాలకు అవకాశం

చెన్నై : దక్షిణ సముద్రతీర జిల్లాల్లో ఈ నెల 28వ తేది నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో పొడి వాతావరణం, చలి నెలకొనివుంది. దక్షిణ సముద్రతీర జిల్లాల్లో 28 నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. చెన్నైలో రాత్రి వేళలో చలి, పగటిపూట పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.


Updated Date - 2020-12-26T16:40:50+05:30 IST