రైల్వే శాఖలో పీపీఈల తయారీ! రోజుకు వెయ్యి పీపీల ఉత్పత్తి

ABN , First Publish Date - 2020-04-07T21:38:05+05:30 IST

కరోనా కట్టడి ప్రయత్నాల్లో భాగంలో రైల్వే శాఖ అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రైల్వే బోగీలల్లో మార్పులు చేసి కరోనా పేషెంట్ల చికిత్స కోసం అందుబాటులోకి తెచ్చింది. తాజాగా వైద్యి సిబ్బందికి కరోనా నుంచి రక్షణ కల్పించే వ్యక్తిగత రక్షణ దుస్తులు(పీపీఈ) తయారీకి కూడా రైల్వే శాఖ నడుంబిగించింది.

రైల్వే శాఖలో పీపీఈల తయారీ!  రోజుకు వెయ్యి పీపీల ఉత్పత్తి

న్యూఢిల్లీ: కరోనా కట్టడి ప్రయత్నాల్లో భాగంలో రైల్వే శాఖ అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రైల్వే బోగీలల్లో మార్పులు చేసి కరోనా పేషెంట్ల చికిత్స కోసం అందుబాటులోకి తెచ్చింది. తాజాగా వైద్య సిబ్బందికి కరోనా నుంచి రక్షణ కల్పించే వ్యక్తిగత రక్షణ దుస్తులు(పీపీఈ) తయారీకి కూడా రైల్వే శాఖ నడుంబిగించింది. డీఆర్‌డీఓ నుంచి ఇందుకు సంబంధించిన అనుమతులు రావడంతో పీపీఈ తయారీ ఏర్పాట్లను ప్రారంభించింది. రైల్వే శాఖకు చెందిన 17 కేంద్రాల్లో వీటిని తయారు చేయబోతున్నట్టు సమాచారం. ప్రతి రోజు 1000 పీపీఈలను ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకునట్టు రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇలా తయారైన పీపీఈల్లో అధికశాతం ఆ డిపార్టెమెంట్ ఆధ్యర్యంలోగల కరోనా ఆసుపత్రుల్లోని సిబ్బందికి ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఇతర వైద్య సిబ్బందికి కూడా పీపీఈలు ఇచ్చే విషయాన్ని రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు. 

Read more