లాక్‌డౌన్‌ 4.0లో నడిపే రైళ్లపై రైల్వే శాఖ స్పష్టత

ABN , First Publish Date - 2020-05-18T03:25:56+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను

లాక్‌డౌన్‌ 4.0లో నడిపే రైళ్లపై రైల్వే శాఖ స్పష్టత

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కాలంలో నడవనున్న రైళ్లపై భారతీయ రైల్వే స్పష్టత ఇచ్చింది. నాలుగో దశ లాక్‌డౌన్ కాలంలో శ్రామిక్, ఇతర ప్రత్యేక రైళ్లు, పార్సిల్, సరుకు రవాణా రైళ్లను నడుపుతామని రైల్వే ప్రకటించింది. జూన్ 30 వరకు ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే.. లాక్‌డౌన్ 3.0 సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాలు రైళ్ల కార్యకలాపాలకు సంబంధించినంత వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.


 ‘‘రైళ్ల కార్యకలాపాల విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఇది లాక్‌డౌన్ 3లో మాదిరిగానే ఉంటుంది. శ్రామిక్ స్పెషల్ రైళ్లు, 15 జతల ప్రత్యేక రైళ్లు, సరుకు రవాణా, పార్శిల్ రైళ్లు తమ సేవలను కొనసాగిస్తూనే ఉంటాయి’’ అని రైల్వే అధికార ప్రతినిధి ఆర్‌డీ బాజ్‌పాయ్ తెలిపారు. 

Updated Date - 2020-05-18T03:25:56+05:30 IST