కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం : రైల్వే మంత్రి పీయూష్

ABN , First Publish Date - 2020-03-14T01:16:09+05:30 IST

కరోనా వైరస్ సోకకుండా రైల్వే శాఖ తరపున అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని కేంద్ర

కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం : రైల్వే మంత్రి పీయూష్

న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకకుండా రైల్వే శాఖ తరపున అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని కేంద్ర రైల్వేశాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదముందని, రైల్వేలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. ‘‘కరోనాపై మా శాఖ పక్షాన అవగాహన కల్పిస్తూనే ఉన్నాం. దీనిపై చాలా శ్రద్ధ పెట్టాం. రైల్వే ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేశాం’’ అని పీయూశ్ గోయల్ ప్రకటించారు.

Updated Date - 2020-03-14T01:16:09+05:30 IST