లోకల్ రైళ్లను తిరిగి ప్రారంభించే యోచనలో రైల్వే
ABN , First Publish Date - 2020-11-04T00:18:50+05:30 IST
లోకల్ రైళ్లను తిరిగి ప్రారంభించే యోచనలో రైల్వే
కోల్‌కతా: కరోనా వైరస్ లాక్‌డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇవ్వడంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు భారత రైల్వే శాఖ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లోకల్ రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో 50 శాతం మంది ప్రయాణీకులను అనుమతిస్తూ పశ్చిమ బెంగాల్‌లో స్థానిక రైలు సేవలను తిరిగి ప్రారంభించాలని భారత రైల్వే అధికారులు యోచిస్తున్నారు. ప్రయాణికులు కోవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయ అన్నారు. నవంబర్ 5న జరిగే సమావేశం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోబడుతుందని, టికెటింగ్, రూట్‌కు సంబంధించిన ప్రణాళికను ఎంపిక చెసినట్లు ఆయన తెలిపారు.