మందవెల్లి రైల్వేస్టేషన్ మూసివేత
ABN , First Publish Date - 2020-05-13T14:31:30+05:30 IST
మందవెల్లి రైల్వేస్టేషన్ మూసివేత

చెన్నై: స్థానిక మందవెల్లి ఎంఆర్‌టీసీ రైల్వేస్టేషన్‌లో బందోబస్తులో ఉన్న ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆ రైల్వేస్టేషన్‌ను మూసివేశారు. రాష్ట్రంలో సుమారు 8 వేల మంది కరోనా సోకి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మందవెల్లి రైల్వేస్టేషన్లలో డ్యూటీలో ఉన్న ఐదుగురు పోలీసులకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో కరోనా లక్షణాలున్నట్లు నిర్ధారణ కావడంతో ఆ రైల్వేస్టేషన్‌ను మూసివేశారు. రాష్ట్రంలో కరోనా లక్షణాలతో రైల్వేస్టేషన్ మూతపడడం ఇదే ప్రథమం.