ప్రైవేటు సంస్థలకు రైల్వేస్టేష్లన్లు: పీయూష్‌

ABN , First Publish Date - 2020-07-22T06:46:51+05:30 IST

రైల్వేస్టేషన్లను వేలంవేసి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. మర్చంట్స్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎంసీసీఐ) నిర్వహించిన వెబినార్‌లో మంత్రి మాట్లాడారు...

ప్రైవేటు సంస్థలకు రైల్వేస్టేష్లన్లు: పీయూష్‌

కోల్‌కతా, జూలై 21: రైల్వేస్టేషన్లను వేలంవేసి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. మర్చంట్స్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎంసీసీఐ) నిర్వహించిన వెబినార్‌లో మంత్రి మాట్లాడారు. రైల్వేస్టేషన్లను ఆధునికీకరించేందుకు కసరత్తు చేస్తున్నామని, అనంతరం వాటిని వేలంవేసి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తామని చెప్పారు. అలాగే సరుకు రవాణా కారిడార్‌ ప్రాజెక్టు పనిని వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఇంతకుముందు 151 పాసింజర్‌ రైళ్లను రైల్వే శాఖ ప్రైవేటీకరించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-07-22T06:46:51+05:30 IST