గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులకు రైల్వే శాఖ కీలక సూచన

ABN , First Publish Date - 2020-05-29T17:32:53+05:30 IST

రైల్వేశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. గర్భిణీలు, పదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులు ప్రయాణాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులకు రైల్వే శాఖ కీలక సూచన

న్యూఢిల్లీ: రైల్వేశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. గర్భిణీలు, పదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులు ప్రయాణాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందుతున్న వ్యక్తులను ప్రయాణాలు చేయొద్దని కోరింది.  శ్రామిక్ రైళ్లలో పెద్ద ఎత్తున వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేరుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. హైపర్ టెన్షన్, మధుమేహ, కేన్సర్, హృద్రోగ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని ప్రయాణాలు చేయొద్దని ప్రకటనలో పేర్కొంది. ఈ మధ్యకాలంలో కొన్ని దురుదృష్టకర ఘటనలు చోటుచేసుకోవడంతో రైల్వేశాఖ తాజాగా ఈ ప్రకటన రిలీజ్ చేసింది.  Updated Date - 2020-05-29T17:32:53+05:30 IST