ఆటిజం బాలుడిని ఆదుకున్న రైల్వే ‘సేతు’!
ABN , First Publish Date - 2020-04-25T07:57:32+05:30 IST
దేశమంతా లాక్‌డౌన్ అమలవుతున్న తరుణంలో, రైల్వే శాఖ ప్రారంభించిన ‘సేతు’ కార్యక్రమం ఎంతోమందికి

భువనేశ్వర్, ఏప్రిల్ 24: దేశమంతా లాక్‌డౌన్ అమలవుతున్న తరుణంలో, రైల్వే శాఖ ప్రారంభించిన ‘సేతు’ కార్యక్రమం ఎంతోమందికి ఆసరాగా నిలుస్తోంది. తాజాగా.. ఆటిజంతో బాధపడుతున్న బాలుడికోసం రాజస్థాన్ నుంచి ఒడిసాకు ఒంటె పాలను సరఫరా చేసింది. బెర్హంపూర్‌కు చెం దిన మూడున్నరేళ్ల బాలుడు ఆటిజంతో పాటు ఫుడ్ ఎలర్జీ సమస్యతో బాధపడుతున్నాడు. ఒంటె పాలు ఆ సమస్య నుంచి ఊరటను కలిగిస్తాయని తెలియడంతో.. అతడి కుటుంబసభ్యులు ‘సేతు’ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన అధికారులు, ఆ పాలను రాజస్థాన్‌లోని ఫల్నా నుంచి ఢిల్లీ, హౌరా స్టేషన్ల మీదుగా భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌కు తరలించి, బాలుడి కు టుంబ సభ్యులకు అందజేశారు. 20 కిలోల బరువున్న ఈ పాల ప్యాకేజీ రవాణాకు అయిన ఖర్చు రూ.125 మాత్రమే కావడం విశేషం.