సాధారణ రైళ్ల పునరుద్ధరణ తేదీని చెప్పలేం

ABN , First Publish Date - 2020-12-19T06:44:50+05:30 IST

దేశంలో సాధారణ రైళ్లను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామన్న విషయంపై కచ్చితమైన తేదీని చెప్పడం సాధ్యం కాదని రైల్వే బోర్డు తెలిపింది.

సాధారణ రైళ్ల పునరుద్ధరణ తేదీని చెప్పలేం

ప్రజల్లో ఇప్పటికీ కరోనా భయం ఉంది: రైల్వే బోర్డు


న్యూఢిల్లీ, డిసెంబరు 18: దేశంలో సాధారణ రైళ్లను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామన్న విషయంపై కచ్చితమైన తేదీని చెప్పడం సాధ్యం కాదని రైల్వే బోర్డు తెలిపింది. ప్రయాణికుల్లో ఇప్పటికీ కరోనా భయం ఉందని రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పారు. రైళ్ల సేవలను పూర్తిస్థాయిలో అందించడంపై తమ అధికారులు పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే క్రమంగా సాధారణ రైళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం 1,089 ప్రత్యేక రైళ్ల సేవలను కొనసాగిస్తున్నామన్నారు. అలాగే, ప్రయాణికుల నుంచి వచ్చే రాబడి గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 87 శాతం తక్కువగా వచ్చిందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రయాణికుల ద్వారా రూ.4,600 కోట్ల రాబడి వచ్చిందని, వచ్చే ఏడాది మార్చిలోగా ఇది రూ.15,000 కోట్లకి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఆ రాబడి రూ.53,000 కోట్లు వచ్చిందని తెలిపారు.

Read more