పార్లమెంటరీ ప్యానెల్ భేటీ నుంచి రాహుల్ వాకౌట్
ABN , First Publish Date - 2020-12-17T07:55:21+05:30 IST
రక్షణ శాఖలో యూనిఫామ్, హోదాల గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం నుంచి రాహుల్ గాంధీ మధ్యలోనే నిష్క్రమించారు. ఆయనతో పాటే రాజీవ్ సతావ్,

న్యూఢిల్లీ, డిసెంబరు 16: రక్షణ శాఖలో యూనిఫామ్, హోదాల గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం నుంచి రాహుల్ గాంధీ మధ్యలోనే నిష్క్రమించారు. ఆయనతో పాటే రాజీవ్ సతావ్, రేవంత్‌రెడ్డి తదితర కాంగ్రెస్ సభ్యులూ వాకౌట్ చేశారని అంతర్గత వర్గాలు వెల్లడించాయి.
కాగా, బజరంగ్ దళ్ ఫేస్‌బుక్ పేజీని నిషేధించాల్సిన అవసరం కనిపించలేదని ఫేస్‌బుక్ ఇండియా హెడ్ అజిత్ మోహన్ పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ(ఐటీ)తో మోహన్ బుధవారం భేటీ అయ్యారు.