డియర్ పీఎం.. అంటూ మోదీకి ప్రశ్నలను సంధించిన రాహుల్

ABN , First Publish Date - 2020-03-23T22:35:27+05:30 IST

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 415 కు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని

డియర్ పీఎం.. అంటూ మోదీకి ప్రశ్నలను సంధించిన రాహుల్

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 415 కు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. అంతేకాకుండా రెండు ప్రశ్నలను కూడా ట్విట్టర్ వేదికగా సంధించారు. ‘‘ గౌరవనీయ ప్రధాన మంత్రిగారూ.... ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం వెంటిలేటర్లను, మాస్కులను అధిక మొత్తంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అయితే మన దేశంలో మార్చి 19 వరకు కూడా వాటి దిగుమతులకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఇక రెండోది... దీని వెనకున్న కుట్రదారులెవరు? ఈ చర్య క్రిమినల్ కుట్ర కిందికి రాదా?’’ అని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మోదీని ప్రశ్నించారు. కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు పెరిగినట్లయితే ఇప్పుడున్న 40,000 వేల వెంటిలేటర్లు ఏ మూలకూ సరిపోవని నిపుణులు హెచ్చరించడంతో రాహుల్ ఈ ప్రశ్నను సంధించారు.  

Updated Date - 2020-03-23T22:35:27+05:30 IST