ఇటలీ వెళ్లిన రాహుల్
ABN , First Publish Date - 2020-12-28T07:41:36+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారంనాడు వ్యక్తిగత పని మీద ఇటలీ వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్లినదీ పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అధికారికంగా చెప్పకపోయినప్పటికీ ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో...

న్యూఢిల్లీ , డిసెంబరు 27: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారంనాడు వ్యక్తిగత పని మీద ఇటలీ వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్లినదీ పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అధికారికంగా చెప్పకపోయినప్పటికీ ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో ఆయన మిలన్ నగరానికి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అక్కడ ఉన్న తన అమ్మమ్మ వద్దకు రాహుల్ వెళ్లారని, త్వరలోనే తిరిగి వచ్చేస్తారని ఆ వర్గాలు వివరించాయి. రైతుల ఆందోళన ఉధృతంగా ఉన్న తరుణంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడంపై కాంగ్రెస్‌లోనే పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి.