‘చమురు’ ఫలాలను ప్రజలకిమ్మని అడిగా
ABN , First Publish Date - 2020-03-16T09:19:22+05:30 IST
అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గినా.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజు సుంకాన్ని...
మన ‘మేధావి’ ఎక్సైజ్ సుంకం పెంచారు: రాహుల్
న్యూఢిల్లీ, మార్చి 15: అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గినా.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజు సుంకాన్ని పెంచడంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్‌గాంధీ ఆదివారం తీవ్రంగా స్పందించారు. ‘‘చమురు ధరలు తగ్గాయి. అందుకు అనుగుణంగా పెట్రోల్ ధరలను తగ్గించి, ఆ ఫలితాలను ప్రజలకు అందజేయండి అని నేను ప్రధాని మోదీని కోరాను. కానీ, ఆయన రూ. 39వేల కోట్ల ఆదాయం కోసం ఎక్సైజు సుంకాన్ని పెంచేశారు’’ అని విమర్శించారు.