బీజేపీ, ఆరెస్సెస్ సామాజిక మాధ్యమాలను కబ్జా చేశాయి : రాహుల్

ABN , First Publish Date - 2020-08-16T22:02:25+05:30 IST

బీజేపీ, ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ ఎంపీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్

బీజేపీ, ఆరెస్సెస్ సామాజిక మాధ్యమాలను కబ్జా చేశాయి : రాహుల్

న్యూఢిల్లీ : బీజేపీ, ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ ఎంపీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్‌ను ఆక్రమించాయని మండిపడ్డారు. అంతేకాకుండా వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీటి ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ... ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

‘‘బీజేపీ, ఆరెస్సెస్ దేశంలో సామాజిక మాధ్యమైన ఫేస్‌బుక్, వాట్సాప్‌ను కబ్జా చేసేశాయి. దీని ద్వారా తప్పుడు వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారు. వీటి ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తారు’’ అని రాహుల్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. 

Updated Date - 2020-08-16T22:02:25+05:30 IST