మోదీజీ కాపాడండి
ABN , First Publish Date - 2020-06-23T08:26:47+05:30 IST
‘మీరు నా సభా నాయకుడు. మీరే నాకు రక్షణ కల్పించాలి’ అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధానిమోదీని అభ్యర్థించారు. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ...

- సభా నాయకుడైన మీరే రక్షణ కల్పించాలి
- ప్రధానికి రఘురామ కృష్ణంరాజు లేఖ
- భద్రతపై పరిశీలిస్తున్న హోం సెక్రటరీ
న్యూఢిల్లీ, జూన్ 22(ఆంధ్రజ్యోతి) : ‘మీరు నా సభా నాయకుడు. మీరే నాకు రక్షణ కల్పించాలి’ అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధానిమోదీని అభ్యర్థించారు. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. తనపై జరుగుతున్న దాడుల గురించి వివరిస్తూ తాజాగా ప్రధానికి ఆయన మరో లేఖ పంపించారు. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ప్రధానిని కూడా కోరారు. కాగా, స్పీకర్‌కు రఘురామకృష్ణంరాజు పంపిన లేఖను కేంద్ర హోం సెక్రటరీ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఎంపీ కోరితే కేంద్ర హోంశాఖ భద్రత కల్పించిన దృష్టాంతాలున్నాయి. గతంలో రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌కు జడ్ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. ఇలాంటి సందర్భాల్లో సీఆర్పీఎఫ్ లేదా సీఐఎ్‌సఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు.