ప్రేక్షకులు లేకుండా రేసులు.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!

ABN , First Publish Date - 2020-09-05T20:23:53+05:30 IST

ప్రేక్షకులు లేకుండా రేసులు నిర్వహించడానికి బెంగళూరు టర్ఫ్ క్లబ్(బీటీసీ)కి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రేక్షకులు లేకుండా రేసులు.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!

బెంగళూరు: ప్రేక్షకులు లేకుండా రేసులు నిర్వహించడానికి బెంగళూరు టర్ఫ్ క్లబ్(బీటీసీ)కి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాము చేసిన విజ్ఞప్తికి శుక్రవారం అనుమతి లభించినట్లు బీటీసీ తెలిపింది. ‘ప్రేక్షకులు లేకుండా, క్లోజుడ్ డోర్స్ రేసింగ్ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతినిస్తోంది’ అని ఓ అధికారిక లేఖలో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేసిన బీటీసీ మేనేజింగ్ కమిటీ మెంబర్ హరిమోహన్ నాయుడు.. అక్టోబరులో ఓ మినీ సీజన్ నిర్వహిస్తామని చెప్పారు.


మార్చి నుంచి ఇక్కడ రేసింగ్ కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇప్పడు వీటిని ఓ చిన్న రేసింగ్ సీజన్‌తో పరారంభిస్తామని, ఆపై పూర్తిస్థఆయిలో వింటర్ సీజన్ నిర్వహించే యోచనలో ఉన్నామని నాయుడు తెలిపారు. పందేల కోసం ఓ యాప్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ఐటీ టీం ప్రస్తుతం అదే పనిలో ఉందని, త్వరలోనే ఈ యాప్ అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

Updated Date - 2020-09-05T20:23:53+05:30 IST