తొలిసారి వీడియో కాల్‌ చేసిన క్వీన్ ఎలిజబెత్.. ఎవరితో మాట్లాడారో తెలుసా?

ABN , First Publish Date - 2020-06-12T01:28:17+05:30 IST

క్వీన్ ఎలిజబెత్ II గురువారం డిజిటల్ మాధ్యమంలోకి అడుగుపెట్టారు. 94 ఏళ్ల రాణి తానుండే విండర్స్ కేస్టల్ నుంచి

తొలిసారి వీడియో కాల్‌ చేసిన క్వీన్ ఎలిజబెత్.. ఎవరితో మాట్లాడారో తెలుసా?

బ్రిటన్: క్వీన్ ఎలిజబెత్ II గురువారం డిజిటల్ మాధ్యమంలోకి అడుగుపెట్టారు. 94 ఏళ్ల రాణి  తానుండే విండర్స్ కేస్టల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలిసారి కోవిడ్ సంరక్షకులతో మాట్లాడారు. మీ కథనాలు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాయని ఈ సందర్భంగా రాణి పేర్కొన్నట్టు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ తెలిపింది. ‘‘ఈ రోజు మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఎలిజబెత్ పేర్కొన్నారు.


ఎలిజబెత్ కుమార్తె ప్రిన్సెస్ అన్నే (69) కూడా వీడియో కాల్‌లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా 24 ఏళ్ల అలెగ్జాండ్రా అట్కిన్స్ మాట్లాడుతూ.. వీడియో కాల్‌లో రాణులిద్దరినీ చూడడాన్ని నమ్మలేకున్నట్టు చెప్పాడు. అలెగ్జాండ్రా తన తల్లిదండ్రులు, నానమ్మను దగ్గరుండి చూసుకుంటోంది. తన బెడ్‌రూములో కూర్చుని ప్రిన్సెస్, క్వీన్‌లతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉన్నట్టు పేర్కొంది.   


క్వీన్ ఎలిజబెత్‌కు టెక్నాలజీపై మక్కువ ఎక్కువ. 1976లో బ్రిటిష్ ఆర్మీ బేస్ నుంచి తొలి ఈ-మెయిల్ పంపారు. 2014లో లండన్ సైన్స్ మ్యూజియం సందర్శన సందర్భంగా తొలి ట్వీట్ చేశారు.   

Updated Date - 2020-06-12T01:28:17+05:30 IST