చైనా ఆధిపత్యధోరణిపై యూఎస్‌, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా ఆందోళన

ABN , First Publish Date - 2020-10-07T08:13:49+05:30 IST

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యధోరణి పెరిగిపోతుండడంపై అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. ఈ ప్రాంతంలో చైనా అధికారాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తంచేశాయి...

చైనా ఆధిపత్యధోరణిపై యూఎస్‌, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా ఆందోళన

  • భారత్‌, అమెరికా విదేశాంగ మంత్రుల భేటీ


టోక్యో, అక్టోబరు 6: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యధోరణి పెరిగిపోతుండడంపై అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. ఈ ప్రాంతంలో చైనా అధికారాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. చైనా ఆధిపత్యధోరణిని అడ్డుకునేందుకు, శాంతి, సుస్థిరతను నెలకొల్పేందుకు ఏర్పాటైన ‘క్వాడ్‌ కూటమి’కి చెందిన దేశాల ప్రతినిఽధులు కరోనా తీవ్రతను లెక్కచేయకుండా టోక్యోలో మంగళవారం సమావేశమయ్యారు. క్వాడ్‌ కూటమిలో అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. షింజో అబె నుంచి ఇటీవలే ప్రధాని బాధ్యతలు స్వీకరించిన యొషిహిడె సుగ  ఈసమావేశానికి అధ్యక్షత వహించారు. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు, అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పోంపియోతో మన విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, భాగస్వామ్య ప్రాజెక్టుల ప్రగతిపై అమెరికా విదేశాంగమంత్రితో మాట్లాడినట్టు జైశకంర్‌ ట్వీట్‌చేశారు.  


Read more