జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో పూరీలో 40 గంటల పాటు షట్‌డౌన్

ABN , First Publish Date - 2020-06-23T02:21:41+05:30 IST

ఒడిశాలో ప్రతీ ఏడాది జరిగే జగన్నాథ స్వామి రథయాత్రకు సుప్రీం కోర్టు ఎట్టకేలకు...

జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో పూరీలో 40 గంటల పాటు షట్‌డౌన్

పూరీ: ఒడిశాలో ప్రతీ ఏడాది జరిగే జగన్నాథ స్వామి రథయాత్రకు సుప్రీం కోర్టు ఎట్టకేలకు అనుమతినిచ్చింది. అయితే.. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో భక్తులు లేకుండా రథయాత్ర నిర్వహించాలని, రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని చెప్పిన ధర్మాసనం.. కొన్ని షరతులతో రథయాత్ర నిర్వహణకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయకపోతే ప్రజలు రథయాత్రకు తరలివచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం పూరీలో 40 గంటల పాటు పూర్తి స్థాయి షట్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.


సోమవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకూ పూరీ నగరంలో దాదాపు కర్ఫ్యూ స్థాయి ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అసిత్ కుమార్ త్రిపాఠి వెల్లడించారు. ప్రజలు కూడా కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అర్థం చేసుకుని, సహకరించాలని ఆయన కోరారు. పూరీకి వచ్చే, వెళ్లే అన్ని ఎంట్రీ పాయింట్స్ మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు. పరిమిత సంఖ్యలో వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మంగళవారం పూరీలో రథయాత్ర ప్రారంభం కానుంది.

Updated Date - 2020-06-23T02:21:41+05:30 IST