జనం లేకుండా పూరీ రథ యాత్ర.. సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం

ABN , First Publish Date - 2020-06-22T19:58:56+05:30 IST

పూరీ జగన్నాథ రథ చక్రాలు కదలనున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో పూరీ రథయాత్ర జరుగుతుందో లేదో అనే సందేహాలకు..

జనం లేకుండా పూరీ రథ యాత్ర.. సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: పూరీ జగన్నాథ రథ చక్రాలు కదలనున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో పూరీ రథయాత్ర జరుగుతుందో లేదో అనే సందేహాలకు తెరపడనుంది. భక్తుల లేకుండా పూరీ రథ యాత్ర నిర్వహించుకునేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టుకు కేంద్రం సోమవారంనాడు తెలిపింది. ఈనెల 23న జరగాల్సిన చారిత్రక జగన్నాథ రథయాత్రపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ డజనుకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సీజేఐ ఎస్ఏ బాబ్డేతో కూడిన త్రిసభ్య బెంచ్ విచారణ చేపడుతోంది.


కోరనా మహమ్మారి నేపథ్యంలో పూరీ సహా ఒడిసాలోని అన్ని ప్రాంతాల్లో రథయాత్రల నిర్వహణపై అత్యున్నత న్యాయస్థానం ఈనెల 18న స్టే ఇచ్చింది. దీనిపై పలువురు తిరిగి కోర్టును ఆశ్రయించారు. మూడు రథాలను పూరీ జగన్నాథ ఆలయంలో సేవలందించేవారు (సర్విటర్లు), పోలీసు అధికారులు సామాజిక దూరం పాటిస్తూ తీసుకువెళ్లేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై కేంద్ర సైతం సుప్రీంకోర్టుకు తమ వాదన తెలియజేసింది. జనం లేకుండా అనుమతించాలని సుప్రీంకోర్టును కోరింది.

Updated Date - 2020-06-22T19:58:56+05:30 IST