రైతులకు సాయం చేసిన దిల్జీత్‌కు ధన్యవాదాలు: సింగర్ సిన్గా

ABN , First Publish Date - 2020-12-06T16:08:09+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు ప్రముఖ పంజాబీ సింగర్, నటుడు...

రైతులకు సాయం చేసిన దిల్జీత్‌కు ధన్యవాదాలు: సింగర్ సిన్గా

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు ప్రముఖ పంజాబీ సింగర్, నటుడు దిల్జీత్ దొసాంజ్ మద్దతు పలికారు. అలాగే వారు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వచ్చి, రైతులను కలుసుకున్నారు. ‘ఉడ్తా పంజాబ్’ సినిమా నటుడు దిల్జీత్ ఆందోళన చేస్తున్న రైతులకు కోటి రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించారు. చలికి వణికిపోతున్న రైతులకు ఉన్ని దుస్తుల కొనుగోలుకు ఈ సాయం అందించారు.


కాగా రైతులకు దిల్జీత్ చేసిన సాయంపై మరో పంజాబీ గాయకుడు సిన్గా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందిస్తూ... దిల్జీత్ అందించిన సొమ్మతో వృద్ధ రైతులకు ఉన్నవస్త్రాలు, కంబళ్లు కొనివ్వాలన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో చలి విపరీతంగా ఉందని, ఈ సమయంలో ఆందోళనలో పాల్గొంటున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. రైతులకు సాయం అందించిన దిల్జీత్‌కు సిన్గా ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2020-12-06T16:08:09+05:30 IST