తబ్లిగి కార్యకర్తలకు 24 గంటల డెడ్‌లైన్

ABN , First Publish Date - 2020-04-08T00:46:09+05:30 IST

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లివచ్చి రహస్యంగా ఉంటున్న తబ్లిగి జమాత్ కార్యకర్తలకు పంజాబ్ ఆరోగ్య శాఖ..

తబ్లిగి కార్యకర్తలకు 24 గంటల డెడ్‌లైన్

చండీగఢ్: ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లివచ్చి రహస్యంగా ఉంటున్న తబ్లిగి జమాత్ కార్యకర్తలకు పంజాబ్ ఆరోగ్య శాఖ 24 గంటల డెడ్‌లైన్ విధించింది. రేపటిలోగా వారంతా పోలీసుల ముందుకు వచ్చి రిపోర్టు చేయాలనీ... లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిజాముద్దీన్ వెళ్లివచ్చిన తబ్లిగి కార్యకర్తలంతా 24 గంటల్లోగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  మొత్తం 467 మంది తబ్లిగి జమాత్ కార్యకర్తలు నిజాముద్దీన్ నుంచి పంజాబ్ రాగా... అందులో 445 మందిని పోలీసులు గుర్తించారు. కాగా మరో 22 మంది ఎక్కడున్నారో ఇంకా తెలియరాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.


కాగా పోలీసులు గుర్తించిన వారిలో 350 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. 111 మందికి కోవిడ్-19 నెగిటివ్ రాగా.. మిగతా 227 మంది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపారు. 

Read more