కెప్టెన్ కీలక నిర్ణయం..

ABN , First Publish Date - 2020-06-23T23:43:10+05:30 IST

కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్‌లాక్-1లో భాగంగా..

కెప్టెన్ కీలక నిర్ణయం..

న్యూఢిల్లీ: కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్‌లాక్-1లో భాగంగా రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మ్యారేజ్ హాల్స్ ఇతర ఆతిథ్య సేవలను 50 శాతం సామర్థ్యంతో తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే నిర్దిష్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.


'పరిశ్రమల ఆందోళనలు, హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని హోటళ్లు, రెస్టారెంట్లు, మ్యారేజ్ హాల్స్, ఆతిథ్య సేవలను తిరిగి అనుమతించాలని నిర్ణయించాం. ఇందుకు ముందస్తు జాగ్రత్తలతో పాటు నిర్దిష్ట ప్రమాణాలను ఆయా రంగాల వారు పాటించాల్సి ఉంటుంది' అని కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. ఇంతకుముందు, హోం డెలివరీ, టేక్ అవే సర్వీసులకు మాత్రమే రెస్టారెంట్లను పంజాబ్ సర్కార్ అనుతించింది. రాత్రి 8 గంటల వరకే ఈ డెలివరీ ఉండాలని కూడా ఆదేశించింది.

Read more