రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ తెరిచేందుకు సీఎం అనుమతి
ABN , First Publish Date - 2020-06-24T00:49:18+05:30 IST
ప్రస్తుతం దేశంలో ‘అన్‌లాక్ 1’ కొనసాగుతోంది. నివరధిక పూర్తిస్థాయి కొన్ని మినహాయింపులతో లాక్‌డౌన్ తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్నది. కరోనా వైరస్ ప్రభావం వల్ల జనాలు ప్రజలు భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం స్పష్టమైన

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో ‘అన్‌లాక్ 1’ కొనసాగుతోంది. నివరధికంగా మూడు నెలల పాటు కొనసాగిన పూర్తిస్థాయి లాక్‌డౌన్ తర్వాత కొన్ని మినహాయింపులతో ప్రస్తుత అన్‌లాక్ కొనసాగుతున్నది. కరోనా వైరస్ ప్రభావం వల్ల జనాలు ప్రజలు భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే మాల్స్, సినిమా హాల్స్, రెస్టారెంట్లు వంటి ప్రదేశాలకు అనుమతి ఇస్తే జనాలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ప్రభుత్వ ఆదేశాలు పాటించరని వాటికి అనుమతి ఇవ్వలేదు.
తాజాగా పంజాబ్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. అయితే అందులో పూర్తి స్థాయిలో జనాల్ని అనుమతించరాదని కేవలం 50 శాతానికి మించకుండా పనులు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ‘‘కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్‌ను తెరిచేందుకు 50 శాతం పరిమితితో అనుమతి ఇవ్వాలని నిర్ణయించాం. ఏదేమైనప్పటికీ అందరూ రాష్ట్ర పోలీసు శాఖ నిబంధనలకు కట్టుబడి ఉండాలి’’ అని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు.