కరోనా, డెంగ్యూలను ఒకేసారి ఓడించిన పదేళ్ల చిన్నారి!

ABN , First Publish Date - 2020-09-16T15:23:22+05:30 IST

మహారాష్ట్రలోని పూణెలో గల ఒక ఆసుపత్రికి చెందిన వైద్యులు పదేళ్ల చిన్నారిని కోవిడ్-19, డెంగ్యూ వ్యాధుల బారి నుంచి తప్పించారు. ఒకే వ్యక్తిలో ఈ రెండు వ్యాధులు కనిపించడం ఈ ప్రాంతంలో ఇదే తొలిసారని వైద్యులు...

కరోనా, డెంగ్యూలను ఒకేసారి ఓడించిన పదేళ్ల చిన్నారి!

పూణె: మహారాష్ట్రలోని పూణెలో గల ఒక ఆసుపత్రికి చెందిన వైద్యులు పదేళ్ల చిన్నారిని కోవిడ్-19, డెంగ్యూ వ్యాధుల బారి నుంచి తప్పించారు. ఒకే వ్యక్తిలో ఈ రెండు వ్యాధులు కనిపించడం ఈ ప్రాంతంలో ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలోని పింపరీ- చింద్వాడలో గల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గల ఫ్లూ క్లినిక్‌లో ఆగస్టు 12న బాధిత బాలిక అడ్మిట్ అయ్యింది. ఆదిత్యా బిర్లా మెమోరియల్ ఆసుపత్రి తరపున వెలువడిన ఒక ప్రెస్‌నోట్‌లో ఈ వివరాలు వెల్లడించారు. 


తీవ్రమైన జ్వరం, గొంతునొప్పి, తదితర సమస్యలతో ఆసుపత్రిలో ఒక బాలిక అడ్మిట్ అయ్యింది. వైద్య పరీక్షల్లో ఆ బాలిక కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సనందించారు. ఈ నేపధ్యంలోనే ఆ చిన్నారికి సీటీ స్కాన్ తీశారు. దీనిలో ఆ బాలికకు డెంగ్యూ ఉన్నట్లు తేలింది. దీంతో ఆ బాలికకు డెంగ్యూ నివారణకు కూడా చికిత్స అందించారు. ఆ బాలిక పూర్తిస్థాయిలో కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 


Updated Date - 2020-09-16T15:23:22+05:30 IST